Skip to main content

Namaste NRI

మిత్రం దేశం ఇలా చేస్తుందా? అమెరికాపై శశిథరూర్‌ ఆగ్రహం

ఇటీవల ఒమన్‌ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై మిత్రదేశం అమెరికా సంతాపం తెలుపకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.

శశిథరూర్‌ మాట్లాడుతూ ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్‌గా ఉంది. అమాయక భారతీయుల ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక మిత్రదేశం వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది? అని ప్రశ్నించారు. ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా, ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు.


Social Share Spread Message

Latest News