మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)2వ మహాసభలు ఘనంగా జరిగాయి. అమెరికాలో తెలుగు సంసృతి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మాటా అసోసియేషన్ ముందు ఉంటుంది. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ ఫెయిర్ గ్రౌండ్ లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించారు దాదాపు 8,000 కు పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ సిద్ధార్థ, దేవిశ్రీ ప్రసాద్, జయప్రద, ఐశ్వర్య రాజేష్, సుమన్, ఆలీ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు,యాంకర్ సుమా, అదిరే అభి, శివారెడ్డి, మిమిక్రీ రమేష్ తదితరులు పాల్గొని ఆహుతులను అలరించారు. గాయకుడు రామ్ మిరియాల లైవ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రద కు మాటా లైఫ్ టైమ్ అవార్డుతో సత్కరించారు. డా. ఎం యస్ రెడ్డికి, డాక్టర్ హారినాత్ పొలిచర్ల కు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా ‘ అవార్డులు ప్రదానం చేశారు.


వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ‘ఎక్సలెన్స్ అవార్డులు అందించారు. టి పి శ్రీనివాస్ రావు ( బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్), సాయినాథ్ కర్నాటి ( యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లురీ (ఆర్ట్స్ అండ్ కల్చరల్), దాము గేదెల( కమ్యూనిటీ సర్వీసెస్), డా. విజయ్ భాస్కర్ బోల్గం( హ్యూమనిటేరియన్ సర్వీసెస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరి), రాజు చామర్థి (గ్లోబల్ తెలుగు హెరిటెజ్), కృష్ణ మద్ది పట్ల (కమ్యూనిటీ సర్వీసెస్)లను అవార్డుల తో సత్కరించారు.


సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ తో ప్రేక్షకులను ఉర్రుతలుఊగించారు. ఈ కార్యక్రమంలో ఆడియో విజువల్ సాంకేతికత , లైటింగ్ నిర్వాహణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ, తెలుగు, అంతర్జాతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ మహాసభలలో వ్యాపారం, నాయకత్వం, కృత్రిమ మేద, మహిళా సాధికారత, న్యాయం, వైద్యం, సాహిత్యం, రాజకీయాలు,యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరంలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నెట్ వర్కింగ్, సెలబ్రేటీ ఇంటరాక్షన్, ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకున్నాయి.


మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో వ్యవస్థాపకులు, అడ్వజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ శ్యామల మరియు అడ్వజరీ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వేనర్ దాము గేదెల, టోనీ జన్ను , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, సెక్రటరి విజయ్ భాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి , స్ప్రి చువల్ మెంబర్ షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రాం డైరెక్టర్ స్వాతి అట్లూరి, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ్ భాస్కర్ బోల్గం, పబ్లిసిటీ మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీ పెరంబదూర్, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా తదితరులు మాటా మహాసభలు విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు అని నిర్వాహకులు తెలిపారు.


































