Namaste NRI

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కరోనా కొత్త వేరియంట్‌ బీ.1.1.529 వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికుల గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల కోసం సవరించిన మార్గదర్శకాలలో సూచించిన ఇతర ప్రమాదకర దేశాల నుండి ప్రయాణించే వారితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ఆయా అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్‌,  కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తెలిపింది. వారిని కలిసిన వారిని కూడా తప్పనిసరిగా ట్రాక్‌ చేసి కరోనా టెస్ట్‌లు చేయాలని పేర్కొంది. బోట్స్‌వ్వానా (3 కేసులు) దక్షిణాఫ్రికా (6 కేసులు), హాంకాంగ్‌ (1 కేసు)లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది.  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ఆరోగ్య  కార్యదర్శులకు లేఖలు రాశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events