Skip to main content

Namaste NRI

అందుకే మూవీకి హే చికీత అనే పేరు పెట్టాం : ధన్‌రాజ్‌

అభినవ్‌ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం హే చికీత. ధన్‌రాజ్‌ లెక్కల దర్శకుడు. ఎన్‌.అశోక ఆర్‌ఎన్‌ఎస్‌, గరుడవేగ అంజి నిర్మాతలు. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌కుమార్‌, ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి రిలీజ్‌ చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.

ఓ ఊర్లో ఉండే అయిదుగురు పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఏం చేశారు? అన్నది ఈ సినిమా కథ అని, అందుకే ఈ సినిమాకు హే చికీత అనే పేరు పెట్టామని, అన్ని రకాల వాణిజ్య అంశాలనూ జోడించి ఈ కథ రాసుకున్నానని. దివిజ, అభినవ్‌ చక్కగా నటించారని దర్శకుడు ధన్‌రాజ్‌ లెక్కల చెప్పారు. హే చికీత అద్బుతంగా వచ్చిందని, కంటెంట్‌ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, ప్రేక్షకులు అందరూ సహకరిస్తారని నిర్మాత గరుడవేగ అంజి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా రచయిత గోపీమోహన్‌, రాజ్‌ నరేంద్ర, చరణ్‌ అర్జున్‌, దేవి ప్రసాద్‌, శివ మల్లాల, అవినాష్‌ కూడా మాట్లాడారు. జూలై 24న సినిమా రిలీజ్‌ కానున్నది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కల్యాణ్‌, దామోదరప్రసాద్‌, రామసత్యనారాయణ, దశరథ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events