Skip to main content

Namaste NRI

డ్రోన్ టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణ .. మీరు ఎక్కడికి వెళ్తే ..అక్కడికి

కెనడాకు చెందిన ఇంజనీర్‌ జాన్‌ ట్సే ఎగిరే గొడుగును కనిపెట్టి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ గొడుగు తయారీలో డ్రోన్‌ సాంకేతికతను వినియోగించాడు. గాలిలో ఎగిరేందుకు ఈ గొడుగుకు నాలుగు ప్రొఫెల్లర్లను అమర్చాడు. దీనిని సాధారణ గొడుగులాగే మడిచి మనతో తీసుకుపోవచ్చు. టైమ్‌-ఆఫ్‌-ఫ్లైట్‌ డెప్త్‌ కెమెరాను ఇందులో అమర్చడం వల్ల అది మనం నడిచే స్థితిని గమనించి తన పొజిషన్‌ను సరిచేసుకుంటుంది. కార్బన్‌-ఫైబర్‌ నైలాన్‌, 3డీ ప్రింటింగ్‌తో వీటి విడిభాగాలను తయారు చేశాడు. తొలుత ఇందులోని విడిభాగాలు తరచూ పగిలిపోతుండేవని, ఏడాది పాటు పలుసార్లు దీనిపై ప్రయోగాలు చేసి చివరకు ఎగిరే గొడుగును లోప రహితంగా తయారు చేసినట్టు ఈ ఇంజినీర్‌ తెలిపాడు.

Social Share Spread Message

Latest News