రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి కొత్త అప్డేట్ వెలువడింది. డిసెంబర్ 21న అమెరికాలోకి టెక్సాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరుకాబో తున్నారు. అమెరికాలో ఇప్పటివరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ జరగలేదని, గేమ్ ఛేంజర్ ఈవెంట్‌ను అత్యంత భారీ స్థాయిలో అందరికి గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలై పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందనల లభించడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మొట్టమొదటి సారిగా ఒక ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతుడంతో ఈ రికార్డును సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించనుంది.