Namaste NRI

భారతీయులకు ఓ శుభవార్త …. వచ్చే ఏడాది నుంచి

కెనడా లో  నివసించే భారతీయులకు ఓ శుభవార్త. కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న విదేశీయుల కుటుంబసభ్యులకూ వర్క్ పర్మిట్ జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫారినర్‌ల కుటుంబసభ్యులు కూడా స్థానికంగా ఉపాధి పొందేందుకు మార్గం సుగమమైంది. అక్కడి ఎన్నారైలకు ఈ నిర్ణయం భారీ ప్రయోజం చేకూర్చనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వర్క్ పర్మిట్ జారీ చేయనున్నారు. ఈ మేరకు కెనడా వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేసర్  కీలక ప్రకటన చేశారు. దేశంలో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న విదేశీయులు కెనడాలో ఉపాధి పొందొచ్చన విషయం తెలిసిందే. ఏ సంస్థలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా చేరేందుకు ఓపెన్ వర్క్ పర్మిట్ అనుమతినిస్తుంది. విదేశీయుల కుటుంబసభ్యులకూ వర్క్ పర్మిట్‌లను విస్తరిస్తున్నాం. 2023 నుంచి ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న విదేశీయుల భాగస్వాములు, కుటుంబసభ్యులకూ వర్క్ పర్మిట్ ఇస్తాము్ణ్ణ అని  మంత్రి ఫ్రేసర్ పేర్కొన్నారు.  వర్క్ పర్మిట్‌ల విస్తరణతో కొత్తగా రెండు లక్షల మంది విదేశీయులకు దేశంలో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events