Skip to main content

Namaste NRI

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి నాలుగు రోజులు

 శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పనిచేసేందుకు అనుమతించింది. దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించేందుకు శ్రీలంక క్యాబినెట్‌ ఆమోదించింది.  ఇంధన కొరతతో కార్యాలయాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార కొరతను అదిగమించేందుకు ఉద్యోగులను వారానికి మూడు సెలవు దినాల్లో తమ ఇండ్లలో కూరగాయాలు, పండ్లు సాగు చేసేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఇంధనం, ఆహారం, మందుల దిగుమతికి అవసరమైన విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత శ్రీలంకను వెంటాడుతోంది.

Social Share Spread Message

Latest News