సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తెలుసుకదా. ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా యూనిట్ కొత్త పోస్టర్స్ను విడుదల చేసింది. ఇద్దరు అమ్మాయిలతో హీరో ప్రేమకథ నేపథ్యంలో సాగే చిత్రమిది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ఒక పోస్టర్లో సిద్ధు, కథానాయిక శ్రీనిధి శెట్టి మంచి రొమాంటిక్ మూడ్లో కనిపించగా, మరో పోస్టర్లో రాశీ ఖన్నా నుదుటిపై సిద్ధు ముద్దాడుతూ కనిపించారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర ్శకురాలిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష కీలకపాత్ర పోషిస్తున్నారు. థమన్ ఎస్. సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ బాబా, ఎడిటర్: నవీన్ నూలి
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)