Skip to main content

Namaste NRI

కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా.. సూపర్ మచ్చి

కల్యాణ్‌ దేవ్‌, రచిత రామ్‌ హీరోయిన్‌గా  పులి వాసు తెరకెక్కించిన చిత్రం సూపర్‌ మచ్చి. రిజ్వాన్‌ నిర్మించారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు పులి వాసు మాట్లాడుతూ ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా సంక్రాంతి రావడం గొప్ప విషయం. నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సూపర్‌ మచ్చి సంక్రాంతికి విడుదలవుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇదొక ఫీల్‌ గుడ్‌ సినిమా. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. రాజు పాత్రలో కల్యాణ్‌ దేవ్‌ నటించారు. ఇందులో ఆయన ఓ గొప్ప ప్రేమికుడిగా కనిపిస్తారు. కన్నడలో రచితా రామ్‌ స్టార్‌. ఇప్పుడు తెలుగులో నటిస్తున్నారు. రచిత పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌ల పాత్రలు సినిమాకి మూల స్తంభాలుగా నిలుస్తాయి. సంక్రాంతి రోజున కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు.

Social Share Spread Message

Latest News