Skip to main content

Namaste NRI

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియా సర్జన్‌ జనరల్‌గా భారత సంతతికి చెందిన దేవికా భూషణ్‌ నియమితులయ్యారు. కొలంబియాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన  దేవికా భూషణ్‌ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఎండీ చేశారు. అంతేకాకుండా జూన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ చిల్డ్రన్స్‌ సెంటర్‌లో దేవికా భూషణ్‌ జనరల్‌ పీడియాట్రిక్స్‌ రెసిడెన్సీని పూర్తి చేశారు. కాలిఫోర్నియా సర్జన్‌ జనరల్‌గా నాడిన్‌ బర్క్‌ హారిస్‌ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని దేవికా భూషణ్‌ భర్తీ చేశారు.

Social Share Spread Message

Latest News