Skip to main content

Namaste NRI

 భారత శాస్త్రవేత్తకు అమెరికాలో.. అరుదైన గౌరవం

భారత వైద్య పరిశోధకుడు డాక్టర్‌ సుభాష్‌ బాబును ప్రతిష్ఠాత్మకమైన బెయిలీ కె ఆష్‌ఫర్డ్‌ పతకం వరించింది. ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి ప్రపంచంలోని అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ అండ్‌ హైజీన్‌ ఈ మేరకు ప్రకటించింది. అలాగే ఫెలో ఆఫ్‌ అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ అండ్‌ హైజీన్‌ అవార్డుకూ ఆయనను ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఒక భారతీయుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఉష్టమండల ప్రాంత వ్యాధులపై పరిశోధనలకు గాను సుభాష్‌కు ఈ గౌరవం దక్కింది. చెన్నైలోని ఐసీఈ ఆర్‌`ఇండియా సంస్థలో సైంటిఫిక్‌ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News