Namaste NRI

మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన గౌరవం

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టి రోజా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టిగా  తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌ గా రాణించిన రోజా అనంత‌రం రాజ‌కీయ‌ల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర మాజీ మంత్రి, నటి రోజా, దర్శక నిర్మాత సెల్వమణి దంపతుల కుమార్తె అన్షు మాలిక (20) అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. తాజాగా నైజీరియా లాగోస్‌లో జ‌రిగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివ‌ల్‌లో సోష‌ల్ ఇంపాక్ట్ కేట‌గిరీలో అన్షు మాలిక గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డును సాధించింది.  అన్షు మాలిక్ కంటెంట్ క్రియేట‌ర్‌గా, కంటెంట్ రైట‌ర్‌గా, డెవ‌ల‌ప‌ర్‌గా, సామాజిక కార్య‌క‌ర్త‌గా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7ఏళ్ల వ‌య‌సులోనే అనేక సాంకేతిక‌త‌ల‌ను అల‌వాటు చేసుకున్న అన్షు ఆ వ‌య‌సులోనే కోడింగ్ నేర్చుకుంది. త‌న 16-17 ఏళ్ల మ‌ధ్య ఫేస్ రిక‌గ్నిషన్ బాట్ యూసింగ్ డీప్ ల‌ర్నింగ్ అనే విభాగం గురించి ఏకంగా థీసిస్ రాసింది. ఆమె రాసిన ఈ థీసిస్ రీసెర్చ్ గురించి అంత‌ర్జాతీయ మీడియా సైతం క‌థ‌నాలు ప్ర‌చురించింది.

ఆమె త‌న 12వ తరగతిలో 95శాతానికి సమానమైన 10 జి పిఏ తో కంప్యూటర్ సైన్స్‌ను అభ్యసించడానికి బ్లూమింగ్టన్‌ లోని ఇండియానా విశ్వవిద్యాలయంలో చేరింది. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ అభ్యర్థులను ఆవిష్కరణ, ప్రభావం, స్థిరత్వం, వారి చొరవ స్కేలబిలిటీ వంటి వివిధ పారామితులపై అంచనా వేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events