Skip to main content

Namaste NRI

అమెరికాలో ఓ అరుదైన దృశ్యం

అమెరికాలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పుతిన్‌ను ఒంటరిని చేసేందుకు రెండు భిన్న ధ్రువాలు ఏకమయ్యాయి. సెనేట్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికనున్ల కలిసిపోయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై మండిపడ్డారు. ఆయనో యుద్ద నేరస్థుడు అంటూ ఆ దేశ ఎగువ సభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్షం, ప్రతిక్షం అన్న తేడా లేకుండా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏకతాటిపైకి వచ్చి పుతిన్‌ తీరును ఖండిరచారు. రిపబ్లికన్‌ సనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రష్యా సైన్యం పాల్పడిన యుద్ధ నేరాల మీద దర్యాప్తు చేయించాల్సిందిగా హెగ్‌ లోని ఇటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ), ఇతర దేశాలకు ఆ  తీర్మానం ద్వారా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌ ప్రజలపై సృష్టిస్తున్న అరాచాకాల నుంచి పుతిన్‌ తప్పించుకోలేకుండా డెమోక్రాట్లు, రిపబ్లిన్లందరం ఏకతాటిపైకి వచ్చామని డెమోక్రాటిక్‌ సెనేట్‌ మెజారిటీ లీడర్‌ చక్‌ ఘామర్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News