Skip to main content

Namaste NRI

సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సౌదీ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. సౌదీ అరేబియా జనరల్‌ ఎంటర్టైన్మెంట్‌ అథారిటీ తాజాగా జాయ్‌ అవార్డ్స్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే సల్మాన్‌ ఖాన్‌కు పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. అవార్డు అందుకుంటున్న ఫొటోను షేర్‌ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు నటీనటులకు అవార్డులతో సత్కరించింది.

Social Share Spread Message

Latest News