Skip to main content

Namaste NRI

కడుపుబ్బా నవ్వించే రోమియో జూలియట్‌ : భార్గవ్‌ మాచర్ల

హర్షిత్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్‌. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి సారీ బేబీ అనే పాటను విడుదల చేశారు. హీరో హర్షిత్‌ మాట్లాడుతూ మా సినిమా గ్లింప్స్‌ను ప్రభాస్‌గారు రిలీజ్‌ చేయడంతో పాటు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. విభిన్నమైన ప్రేమకథ ఇది. నేను చేసిన క్యారెక్టర్‌ను ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు అన్నారు.

మనందరి బయోపిక్‌గా ఈ సినిమా గురించి చెప్పొచ్చని, ఎందుకంటే అందరూ ఏదో ఒక సన్నివేశంతో తప్పకుండా కనెక్ట్‌ అవుతారని, వినోదం, భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథ ఇదని దర్శకుడు భార్గవ్‌ మాచర్ల తెలిపారు. నవంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, రచన: భార్గవ్‌ మాచర్ల, ప్రశాంత్‌ రాగతి, దర్శకత్వం: భార్గవ్‌ మాచర్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events