Skip to main content

Namaste NRI

అమెరికాలో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కేటీఆర్‌కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. లాస్‌ ఏంజిల్స్‌లో తమకు స్వాగతం పలికిన ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధిపై వారితో చర్చించారు.

Social Share Spread Message

Latest News