Skip to main content

Namaste NRI

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రవాస సంఘాల ఆత్మీయ సమావేశం

తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వారి సహకారంతో వందలాది మంది భారతీయుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య  నాయుడు మాట్లాడుతూ  మాతృభాష, మాతృభూమి, మాతృదేశాన్ని మించిన ఆస్తి, అస్తిత్వం లేవన్నారు. అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మనవైన సంస్కృతీ, సంప్రదాయాలను రాబోయే తరాలకు సైతం అందించాలని చెప్పారు. మన కట్టు, బొట్టు, బాష, యాస వదులుకోవాల్సి అవసరం లేదని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటూ, మానవీయ విలువలను కాపాడుకుంటూ, సామాజిక బాధ్యతతో నడచుకోవటమే సనాతన జీవన విధానమని అన్నారు. ఆ ధర్మాన్నే అందరూ పాటించాలని కోరారు.

ఈ సమావేశంలో  తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ప్రసాద్ అడపా, కృష్ణ లామ్, సునీల్ సింగ్, కృప సింగ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, శ్రీనివాస్ గంగా, సుధా పాలడుగు, శ్రీవిద్య, పలు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News