Skip to main content

Namaste NRI

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా  పారిస్ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.   ఈ పర్యటనలో భాగంగా భారత్‌ ఫ్రాన్స్ పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని ఆయన పేర్కొన్నారు. పారిస్‌లోని హోటల్‌కు చేరుకున్న తర్వాత ప్రధాని ప్రవాస భారతీయులు, వారి పిల్లలతో కొద్ది సేపు ముచ్చటించారు. మోదీ రాకకోసం హోటల్ బయట ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయులు ఆయన రాగానే భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో మోదీ తొలుత ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో సమావేశమవుతారు. అనంతరం సెనేట్‌ను సందర్శించి సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ అవుతారు.

Social Share Spread Message

Latest News