Namaste NRI

అమెరికాలో ఓ మహిళకు అదృష్టం

అమెరికాలో ఓ మహిళను అదృష్టం ఊహించని విధంగా వరించింది. ఆమె ఆడబిడ్డను ప్రసవించిన కొద్ది గంటలకే లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ లాటరీలో ఆమెకు ఏకంగా లక్ష డాలర్లు ఆమె సొంతమయ్యాయి. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ.81 లక్షలకు సమానం. నార్త్ కెరోలీనాకు చెందిన బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ ఇటీవల ఓ లాటరీ టిక్కెట్ కొన్నారు. కాంకార్డ్ నగరంలో గల ఓ క్విక్‌ట్రిప్ స్టోర్‌లో ఆమె టిక్కెట్ కొనుగోలు చేశారు. తన ఇద్దరు కొడుకుల పుట్టిన రోజు తారీఖు నెంబర్లతో ఉన్న టిక్కెట్‌ను ఆమె ఎంచుకున్నారు. ఆ తరువాత నవంబర్ 9న పురిటినొప్పులు మొదలవడంతో బ్రెండా ఆస్పత్రిలో చేరారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన లాటరీ టిక్కెట్ విషయాన్నే మర్చిపోయారు. అయితే.. బిడ్డను కన్న కొద్ది గంటలకు తాను లాటరీ గెలుచుకున్నట్టు బ్రెండా తెలుసుకుని తెగ సంబరపడిపోయారు. ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events