Skip to main content

Namaste NRI

అమెరికా  ఎన్నికల బరిలో  భారత సంతతి మహిళ

అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా మది గవర్నర్లుగా, కాంగ్రెస్‌ సభ్యులుగా, సెనెటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు. భారత మూలాలున్న కమలా హారిస్‌ ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. తాజాగా గజియాబాద్‌కు చెందిన సబా హైదర్‌ కౌంటీ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. భారత సంతతికి చెందిన సభా హైదర్‌ ఇల్లినాయిస్‌లోనని డ్యూపేజ్‌ కౌంటీ నుంచి రాష్ట్ర బోర్డు ఎన్నికల బరిలో నిలిచింది. ఈమె అభ్యర్థిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు.  డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా సబా హైదర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  ఇవాళ జరుగనున్న ఈ ఎన్నికలో దాదాపు 10 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర స్థాయి బోర్డులో 19 మంది సభ్యులుండగా, 11 మంది డెమోక్రాట్లే. ఈ ఎన్నికల్లో సబా విజయం సాధిస్తే డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న అమీ షావేజ్‌ స్థానంలో నియమితులవుతారు.  సబా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌. బీఎస్సీలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అలీఘడ్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేసిన తర్వాత 2007లో ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగో వచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events