Skip to main content

Namaste NRI

ఇప్పట్లో ఆది సాధ్యం కాదు..ముందు మస్కోకు వెళ్లనివ్వండి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఇవ్వాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతు ఇచ్చిన రష్యాలోని ఆర్థడాక్స్‌ చర్చిని పుతిన్‌కు ఆల్టర్‌ బాయ్‌ వలే పనిచేయకూడదని హితవు పలికారు. యుద్ధం మొదలుకాగానే పోప్‌ ఫ్రాన్సిస్‌ రష్యా దౌత్య కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదే సమయంలో తాను మాస్కోకు రావాలనుకుంటున్న విషయాన్ని క్రెమ్లిన్‌ నేతకు తెలియజేయాలనే సందేశం పంపాన్నారు. కానీ, ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు. పుతిన్‌ అసలు తనతో భేటీ కావాలని కోరుకోవడం లేదన్న భయంతో తనలో ఉందని వెల్లడిరచారు. కీవ్‌ పర్యటనపై కూడా పోప్‌ స్పందించారు. ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన వెల్లడిరచారు. ముందు మాస్కోకు వెళ్లనివ్వండి. పుతిన్‌తో భేటీ కానివ్వండి. తొలుత నేను ఏమి చేయగలనో అవి చేయనీయండి. పుతిన్‌ మాత్రమే దీని పరిష్కారానికి అవకాశం ఇవ్వగలరు అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News