Skip to main content

Namaste NRI

జిలేబి నుంచి ఆకు పాకు పాట విడుదల

శ్రీకమల్ హీరోగా,  శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం జిలేబి. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ చిత్రం. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆకు పాకు  అనే పాటని విడుదల చేశారు మేకర్స్. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ పాటని క్యాచి నెంబర్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడిన ఈ పాటలో లీడ్ పెయిర్ కంగారు పడుతూ పరుగులు తీయడం థ్రిల్లింగ్ గా వుంది. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు  కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, డీవోపీ: సతీష్ ముత్యాల, ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ, పీఆర్వో : వంశీ శేఖర్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events