Skip to main content

Namaste NRI

అమెరికాలో ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం 

అమెరికాలో వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఆంధ్ర ప్రదేశ్  లోని గుంటూరుకు చెందిన వీ దీప్తి యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌ చదువుతున్నది. ఈ నెల 12న టెక్సాస్‌లోని డెంటాన్‌ సిటీలో తన జిల్లాకే చెందిన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దీప్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News