Namaste NRI

 అనుకోకుండానే ఆ త‌ప్పు… రిషి సునాక్‌

బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్‌ పార్ల‌మెంట్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించారు. భార్య అక్ష‌త మూర్తికి  చైల్డ్‌కేర్ కంపెనీలో షేర్లు ఉన్న‌ట్లు ప్ర‌ధాని రిషి సునాక్ పార్ల‌మెంట్‌కు వెల్ల‌డించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై ఏప్రిల్‌లో పార్ల‌మెంట్ క‌మిటీ విచార‌ణ చేప‌ట్టింది. చైల్డ్‌కేర్ ప‌థ‌కాల‌తో రిషి సునాక్ భార్య‌కు ల‌బ్ధి చేకూరుతున్న‌ట్లు విప‌క్షాలు ఫిర్యాదు చేసిన త‌ర్వాత పార్లమెంట‌రీ క‌మిటీ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. ఆ క‌మిటీ చీఫ్ డేనియ‌ల్ గ్రీన్‌బ‌ర్గ్ విచార‌ణ నిర్వ‌హించారు. ఆయ‌న త‌న నివేదిక‌లో రిషి సునాక్‌ను త‌ప్పుప‌ట్టారు. సీనియ‌ర్ ఎంపీల‌కైనా ఆయ‌న త‌న భార్య షేర్ల గురించి చెబితే బాగుండేద‌ని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అనుకోకుండానే ఆ త‌ప్పు జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను రిషి సునాక్ అంగీక‌రించారు. క్ష‌మాప‌ణ‌లు కూడా తెలిపారు. దీంతో ప్ర‌ధాని రిషి సునాక్‌పై ద‌ర్యాప్తును ఆపేశామ‌ని, ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని గ్రీన్‌బ‌ర్గ్ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events