Namaste NRI

ఈ విషయంలో ఆప్ఘన్ నేతలు ఒక్కటి కావాలి : జో బైడన్

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తమ బలగాలను ఉపసంహరించడం పట్ల తానేమీ చింతించడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మరోవైపు తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో కీలక ప్రాంతాలను  మళ్లీ చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే 65 శాతం ఆ దేశ భూభాగంలో ఆధిపత్యాన్ని చాటారు. భగలాన్‌ ప్రావిన్సు రాజధాని పుల్‌ ఏ కుమ్రి పట్టణాన్ని కూడా తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. వారం రోజుల్లోనే తాలిబన్ల ఆధీనంలోకి మరో ప్రాంతీయ రాజధాని వెళ్లినట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో ఆఫ్ఘన్‌ నేతలు ఒక్కటి కావాలని బైడెన్‌ పిలుపునిచ్చారు. దేశం కోసం ఆప్ఘన్‌ దళాలు పోరాడాలని, దేశాన్ని వాళ్లే కాపాడుకోవాలని బైడెన్‌ తెలిపారు. తమ దళాలను వెనక్కి రప్పించిన అంశంలో క్షమాపణలు చెప్పేది లేదని, ఎందుకంటే గడిచిన 20 ఏళ్లలో తమ దళాల కోసం సుమారు ట్రిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ ఖర్చు అయ్యిందన్నారు. ఆఫ్ఘన్‌ దళాలకు వైమానిక మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]