1968 మెక్సికో ఒలింపిక్స్‌లో చివరిసారి మాడిలైన్ మ్యానింగ్ అమెరికా మహిళల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం అందించింది. ఆ తర్వాత ఈ విభాగంలో యూరోపియన్, ఆఫ్రికన్ అథ్లెట్ల ఆధిపత్యం మొదలైంది. ఎట్టకేలకు 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ 800 మీటర్ల మహిళ విభాగంలో అమెరికాకు స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 800 మీటర్ల ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల ఎతింగ్ మూ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. ఎతింగ్ మూ 1ని.55.21 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది. కీలీ హాడ్జ్‌కిన్సన్ (బ్రిటన్`1ని.55.88 సెకన్లు) రజతం..రెవీన్ రోజర్స్ (అమెరికా`1ని.56.81 సెకన్లు కాంస్యం సాధించారు.