Namaste NRI

అహో అనిపించిన ‘తాజా’ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్ విల్లే ఏరియా, USA) సంక్రాంతి సంబరాలు

గ్రేటర్ జాక్సన్విల్ ప్రాంతంలోని తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జాక్సన్విల్ తెలుగు సంఘం (తాజా) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. జనవరి 21వ తేదీన తాజా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి, వారి టీమ్ ఆధ్వర్యంలో జాక్సన్విల్లోని బొల్లెస్మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలు అందరినీ తమ సొంత ఊరిలో వేడుకలను చేసుకుంటున్నామా అన్నట్లుగా మురిపించాయి. తెలుగుదనంతో ప్రదర్శించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషను, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీ, సంప్రదాయ దుస్తుల పోటీలను కూడా నిర్వహించారు. రంగురంగుల అలంకరణలు, రుచికరమైన అల్పాహారం, స్వీట్లతో కూడిన రాత్రి భోజనం మరియు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పద్మప్రియ కొల్లూరు, సమత దేవునూరి, వినయ యాద ఈవెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి మాట్లాడుతూ, ఈ వేడుకలను ఇంత గ్రాండ్ గా దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ, సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. తాజా ద్వారా కమ్యూనిటీకి నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలియజేశారు. తాజా ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ఎగ్జిక్యూటివ్ టీమ్ను కూడా అభినందించారు. కమిటీ సభ్యులు, వాలంటీర్లు, గ్రేటర్ జాక్సన్విల్లే ప్రాంత తెలుగు భాష, సంగీతం నేర్చుకునే పిల్లలు, మనబడి, పాఠశాల, సఖా ఇతర సంగీత పాఠశాలలు, తాజా కుటుంబాల వారి ఉపాధ్యాయుల మద్దతుతో జరిగిన ఈ వేడుకలు అందరినీ అలరించేలా సాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ 2023 సంక్రాంతి ఈవెంట్కు ఉదారంగా స్పాన్సర్షిప్ చేసినందుకు వాసవ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events