
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఈ షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్‌ఏ స్క్రీనర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో ఎయిర్‌పోర్ట్స్‌లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ అక్టోబర్ 1 నుంచి మొదలైన విషయం తెలిసిందే. దీంతో కొన్ని అత్యవసర సేవల విభాగాలకు మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక నగరాల్లోని విమానాశ్రయాల్లో ఏటీసీ సిబ్బంది విధులకు హాజరుకావటం లేదు. ఎయిర్‌పోర్ట్స్‌లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా అమెరికా వ్యాప్తంగా విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి.
















