Namaste NRI

నేవీ వైస్ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అజ‌య్ కొచ్చార్

ఆప‌రేష‌న్ సింధూర్ వ్యూహాక‌ర్త వైస్ అడ్మిర‌ల్ అజ‌య్ కొచ్చార్‌ నేవీ వైస్ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌స్తుతం మిలిట‌రీలోని టాప్ నేత‌ల మార్పులు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా అజ‌య్ కొచ్చార్ ప‌దోన్న‌తి పొందారు. త్రివిధ ద‌ళాలు కొత్త చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ రాజా సుబ్ర‌మ‌ణి, త‌దుప‌రి నేవీ చీఫ్ వైస్ అడ్మిర‌ల్ కే స్వామినాథ‌న్‌.. ఆదివారం రోజున త‌మ కొత్త బాధ్య‌లు స్వీక‌రించ‌నున్నారు. ఇక శుక్ర‌వారం రోజున ముంబైలోని వెస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌కు క‌మాండ‌ర్‌గా వైస్ అడ్మిర‌ల్ సంజ‌య్ వాత్సాయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుత సీడీఎస్ జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్‌, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ డీకే త్రిపాఠి శ‌ని, ఆదివారాల్లో ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆర్మీ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30వ తేదీన ఆర్మీ చీఫ్‌గా రిటైర్ కానున్నారు.

వైస్ అడ్మిర‌ల్ కొచ్చార్‌ది హ‌ర్యానాలోని క‌ర్నాల్‌. ఆయ‌న తండ్రి హ‌ర్యానా ఇరిగేష‌న్ శాఖ‌లో మాజీ ఇంజినీర్‌. శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత జాతీయ వార్ మెమోరియ‌ల్ వ‌ద్ద కొచ్చార్ పుష్ప‌గుచ్ఛం ఉంచారు. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో నేవీకి చెందిన ప్లానింగ్‌ను అడ్మిర‌ల్ కొచ్చార్ చేశారు. ముంబై నుంచి ఆయ‌న ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ప‌శ్చిమ స‌ముద్ర ప్రాంతంలో ఉన్న శ‌త్రు స‌మ‌స్య‌ను ఆయ‌న త‌న ప్లానింగ్‌తో ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events