అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఖైదీగా అజిత్ సరికొత్త అవతారంలో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమా ఇదని, యాక్షన్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన-దర్శకతత్వం: అధిక్ రవిచంద్రన్.