Namaste NRI

సిద్ధు జొన్నలగడ్డ  తెలుసుకదా చివరి షెడ్యూల్‌

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తెలుసుకదా. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు.  నీరజా కోన దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది.

ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో నాయకానాయికలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, దీనితో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని, డబ్బింగ్‌ పనులను కూడా మొదలుపెట్టామని చిత్రబృందం పేర్కొంది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అలరిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ బాబా, సంగీతం: తమన్‌, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్‌, టీజీ కృతిప్రసాద్‌, రచన-దర్శకత్వం: నీరజ కోన.

Social Share Spread Message

Latest News