Namaste NRI

ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది.. జర్మనీలో ఘనంగా వేడుకలు

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసిందని హాంబర్గ్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వడ్డాది అన్నారు. జర్మనీలోని హోంబర్గ్ పట్టణంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాంబర్గ్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వడ్డాది పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు శశిధర్ ఏమిరెడ్డి, డా.శివ శంకర్ లింగం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ  గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల అప్రమత్తంగా వ్యవహరించి విధ్వంసకారులకు తగిన గుణపాఠం చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు.

శశిధర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఏడాదిలోనే బాబు సూపర్ సిక్స్ హామీలను దాదాపుగా నెరవేర్చారన్నారు. ఎన్టీపీసీ, ఆర్సెల్లార్ మిట్టల్, రిలయన్స్ సీబీజీ, బీపీసీఎల్, టీసీఎస్, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడల ద్వారా రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందన్నారు.

డాక్టర్ శివశంకర్ లింగం మాట్లాడుతూ దేశం గర్వించేలా అమరావతి ప్రజారాజధానిని కూటమి ప్రభుత్వం వేగంగా నిర్మిస్తోందన్నారు. ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హాంబర్గ్ టీడీపీ నేతలు, విక్రమ్ తల్లపనేని, దినేష్ పాకలపాటి, కిషోర్ దాసుగారి, అఖిల్ ప్రసన్న దున్న, శ్రీకాంత్ గోళ్ళ, భరత్ శీలంనేని, ఉజ్వల్ మారెడ్డి, హాంబర్గ్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు అంకారావు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events