Namaste NRI

భారత్‌-కెనడా మధ్య కుదిరిన అంగీకారం

నిజ్జర్‌ హత్యతో దెబ్బతిన్న భారత్‌-కెనడా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇటీవలే జరిగిన కెనడా ఎన్నికల్లో అధికార మార్పు జరగడం,  తాజాగా ప్రధాని మోదీ కెనడా పర్యటనతో మొత్తం మారిపోయింది. ట్రూడో పాలనలో తెగిపోయిన సంబంధాలు ఇప్పుడు మళ్లీ బలపడుతున్నాయి.

రెండు దేశాల మధ్య పూర్తి దౌత్య సేవలను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలూ తాజాగా అంగీకారానికి వచ్చాయి. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీతో మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా దౌత్యవేతలను తిరిగి నియమించడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇరుదేశాల పౌరులు, వ్యాపారాలకు సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ సమావేశం ముఖ్యమైనదని భావిస్తున్నానని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events