Skip to main content

Namaste NRI

అప్రమత్తమైన అమెరికా.. సీడీసీ కీలక ప్రకటన

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈజీ. 5 వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో వెలుగులోకి రాగా, తాజాగా అమెరికాలో మరోకొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. కొవిడ్‌ 19కి చెందిన అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ వేరియంట్‌కు బీఏ.2.86 గా పేరు పెట్టినట్లు పేర్కొంది.

 కొవిడ్‌-19కి చెందిన కొత్త వేరియంట్‌ను కనుగొన్నాం. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టాం. ఈ కొత్త వైరస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌, డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లో కనుగొనబడింది. కొత్త వేరియంట్‌కు చెందిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం’ అని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌ అమెరికాతోపాటు ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌ దేశాల్లో కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events