Namaste NRI

పుష్ప 2 రూల్ పాటల ప్రమోషన్‌లకు సర్వం సిద్ధం

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం పుష్ప-2.  ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బన్నీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటల ప్రమోషన్‌కు తెరలేవనుంది. దర్శకు డు సుకుమార్‌ పాటల రూపకల్పన మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే విషయం తెలిసిందే. దాంతో పుష్ప-2 గీతాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సంగీత ప్రియుల్లో నెలకొని ఉంది. ఈ సినిమాలో పుష్ప పుష్ప పుష్పరాజ్‌ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను మే 1న విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందించిన ఈ సిని మా గీతాలు ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమా ట్రోగఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: యస్‌.రామకృష్ణ-మోనిక నిగోత్రే, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్‌ బి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress