Skip to main content

Namaste NRI

సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా. సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. రాబరీ నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ధిక్కార స్వభావం కలిగిన ఓ యువకుడు తన తండ్రి చేసిన అప్పులు తీర్చాలనే తపనతో జూదం, దోపిడీలతో కూడిన ఓ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు.

అక్కడ అతను ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులు, లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయని, యాక్షన్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్‌, శివ్‌ పండిట్‌ తదితరులు నటిస్తున్నారు. జూలై 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్నందిస్తున్నారు. సుభాస్కరన్‌ నిర్మాత.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events