Skip to main content

Namaste NRI

రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే కవితపై ఆరోపణలు..  అభిలాష గొడిశాల

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అభిలాష  మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత చేస్తున్న ఉద్యమానికి భారీ మద్దతు లభించటంతో బీజేపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. తెలంగాణ బతుకమ్మను విదేశాల్లో కూడ ఘనంగా జరుపుకొంటున్నామంటే దానికి కారణం కవిత అని స్పష్టంచేశారు.   ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి మహిళల పట్ల ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.  రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుక ఉందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News