Skip to main content

Namaste NRI

రష్యాకు అమెరికా షాక్.. జర్మనీ, బ్రిటన్ బాటలోనే

రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రికత్తల నేపథ్యంలో రష్యాపై  అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు, వెబ్‌, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని తెలిపారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని ఆక్రమించాలని పుతిన్‌ చూస్తున్నాడన్నారు. వెస్ట్‌ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య, సంబంధాలను నిలిపివేశామని తెలిపారు. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు.

Social Share Spread Message

Latest News