సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తెరకెక్కించిన చిత్రం గాలోడు. సంస్కృతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. సప్తగిరి, పృథ్విరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సుధీర్, యువత, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉండే ఈ సినిమా థియేటర్‌కి వెళ్లి చూడాలన్నారు గెహ్నా. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటిదాకా మా సినిమా నుంచి విడుదల చేసిన పాటలకు, ట్రైలర్‌కు రెప్పాస్స్ బాగుంది. ట్రైలర్‌కు 24 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ స్పందన సినిమా మీద మాకు మరింత నమ్మకాన్ని పెంచుతున్నది. కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు యూత్‌కు బాగా నచ్చుతుంది అన్నారు. ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. ఛాయాగ్రహణం సి.రాంప్రసాద్, సంగీతం భీమ్స్ సిసి రోలియో.














