తన నటన, అభినయంతో సొంత గుర్తింపుని తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే, మరో వైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తూ హిందీ లో టాప్ హీరోయిన్‌లో ఒకరిగా దూసుకుపోతుంది. ఇక గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం అలియాభట్ నటించిన హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ మరో మూడు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో అలియా చిత్రయూనిట్‌తో కలిసి ప్రమోషన్‌లు చేస్తుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా మరో హీరోయిన్ గల్ గాడోట్‌కు తెలుగు నేర్పిస్తూ అలరించింది. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాటకు గల్ గాడోట్‌తో స్టెప్పులేయించింది.














