Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో మరో దారుణం.. అందరూ చూస్తుండగానే

అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే ఓ అమెరికన్‌ కత్తితో దాడికి పాల్పడారు. పలుమార్లు కత్తితో పొడిచి భారతీయుడి బైక్‌ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన న్యూయార్క్‌లోని లోయర్‌ ఈస్ట్‌ సైడ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉబేర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసే భారత్‌భాయ్‌ పటేల్‌ (36)అనే భారత వ్యక్తి ఫ్యామిలీతో కలిసి క్వీన్స్‌ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో  తన ఇ`బైక్‌పై ఫుడ్‌ డెలివరీకి వెళ్లాడు. లోయర్‌ ఈస్ట్‌ సైడ్‌ ప్రాంతంలో డెలివరీకి వెళ్లిన భారత్‌భాయ్‌ను ఓ వ్యక్తి అడుకున్నాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన భారత్‌భాయ్‌ కిందపడిపోగానే సదరు వ్యక్తి బైక్‌ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అందరూ అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. తనను కాపాడాలని భారత్‌భాయ్‌ సహాయం కోసం అరిచిన ఎవరూ పట్టించుకోలేదు.

కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు భారతీయుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే నిందితుడి కోసం గాలించారు. ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని 47 ఏళ్ల కూపర్‌గా గుర్తించిన పోలీసులు కొన్ని గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.  కూపర్‌పై ఇప్పటికే పలు నేరాల కింద పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events