Namaste NRI

ఎలాన్‌ మాస్క్‌  మరో కీలక నిర్ణయం… వచ్చే వారం నుంచే

 ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌  ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  ట్విట్టర్‌ను తన చేతుల్లో తీసుకున్నప్పటి నుంచి పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.  వచ్చే వారం నుంచి ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్ట్టనున్నట్లు వెల్లడిరచారు. విధ్వేషపూరిత పోస్టులు, నకిలీ సమాచార వ్యాప్తి తదితర కారణాలతో గతంలో పలువురి ఖాతాలను ట్విట్టర్‌ నిలిపివేషిన విషయం తెలిసిందే.  ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటి కంగనా రనౌత్‌ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.

Social Share Spread Message

Latest News