Skip to main content

Namaste NRI

వలసదారులకు అమెరికా మరో షాక్‌!

విదేశీ వలసదారులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో షాకిచ్చింది. తమ వర్క్‌ పర్మిట్‌ పునరుద్ధరణ (రెన్యువల్‌) దరఖాస్తుల ఆమోదం కోసం ఎదురుచూస్తున్న కొంతమంది వలసదారులకు ఉపాధి అధికారిక పత్రాల(ఈఏడీ) ఆటోమెటిక్‌ పొడిగింపును అమెరికా నిలిపివేసింది. 2025 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఒక విధానాన్ని శాశ్వతం చేసే నిబంధనను డీహెచ్‌ఎస్‌ ఖరారు చేసింది. ఈ విధానం ప్రకారం అర్హులైన దరఖాస్తుదారులు వారి ప్రస్తుత వర్క్‌ పర్మిట్ల గడువు ముగిసిన తర్వాత 540 రోజుల వరకు పని కొనసాగించడానికి అనుమతించే నిబంధనను డీహెచ్‌ఎస్‌ తొలగించింది.

ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న విదేశీ పౌరులను, ముఖ్యంగా ఉద్యోగంలో కొనసాగడానికి ఉపాధి అనుమతిపై ఆధారపడిన భారతీయ నిపుణులను, అలాగే హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను ప్రభావితం చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ వర్క్‌ పర్మిట్‌ని పొడిగించుకోవడానికి ముందు యూఎస్‌సీఐఎస్‌ నుంచి ఆమోదం పొందవలసిన ఆవశ్యకతను ఈ తుది నిబంధన మరింత బలపరుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events