Skip to main content

Namaste NRI

అమిగోస్ నుంచి మరో అప్‌డేట్‌.. ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ

నందమూరి కల్యాణ్రామ్ నటిస్తున్న చిత్రం అమిగోస్.  ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా నందమూరి అభిమానుల కోసం బాలకృష్ణ ఆల్బమ్లోని సూపర్ హిట్సాంగ్ రీమిక్స్ చేయబోతున్నారు. ఈ హింట్తో బాలకృష్ణ, దివ్యభారతి నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను అమిగోస్ లో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పుడిదే పాటకు సంబంధించిన అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు. జనవరి 29న సాయంత్రం 5 గంటలకు ఈ రెండో పాటను లాంఛ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశాడు కల్యాణ్రామ్ . రీమిక్స్ సాంగ్ మరో బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని తాజా లుక్తో అర్థమవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన అమిగోస్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. యెక యెక అంటూ సాగే తొలి పాటకు మంచి స్పందన వస్తోంది. అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events