Skip to main content

Namaste NRI

రిషి సునాక్‌ ఇంటి వద్ద ఆందోళన..ఎందుకో తెలుసా?

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ప్రైవేటు గృహం వద్ద పర్యావరణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై ఓ నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన వ్యక్తం చేశారు. చమురు బావుల తవ్వకాలపై ఆయన ప్రభుత్వ  విధానాలను తప్పుపట్టారు.  ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో గల రిషి సునాక్‌ ఇంటిపైకి కొందరు ఎక్కి నల్లటి వస్త్రాన్ని కప్పేసినట్లుంది. మరో ఇద్దరు ఆందోళనకారులు రిషి సునాక్‌ చమురు లాభాలా.. మా భవిష్యత్తా ? అన్న నినాదాలు రాసిన బ్యానర్‌ను పట్టుకొన్నారు. మా ప్రధాని పర్యావరణ పరిరక్షణలో ముందుండాల్సిన అవసరం ఉంది. పర్యావరణ విధ్వంసంలో కాదు అని గ్రీన్‌పీస్‌ యూకే సంఘం పేర్కొంది. ఈ  ఘటనపై ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం స్పందించింది. పోలీసులు అక్కడే ఉన్నారని తెలిపింది. దేశ ఇంధన భద్రత, వనరుల సద్వినియోగం కోసం తీసుకొన్న సరైన నిర్ణయంపై ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మనం పుతిన్‌ వంటి ఆక్రమణదారులపై ఇంధనం కోసం ఆధారపడలేము అని పేర్కొంది.

Social Share Spread Message

Latest News