వినయ్, అరుణ్, దీప్తి వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లక్ష్మీకటాక్షం. ఫర్ ఓట్ అనేది ఉపశీర్షిక. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి నిర్మాతలు. సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాకు చెందిన డైలాగ్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సాధారణంగా రాజకీయనాయకులు ఓటుకి ఇంత డబ్బు అని నిర్ణయిస్తారు. కానీ ఈ డైలాగ్ పోస్టర్‌లో ఓటర్ అనేవాడు తన రేటును తానే నిర్ణయించుకుంటాడు. ప్రస్తు తం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి అద్దం పట్టేలా ఈ డైలాగ్ పోస్టర్ డిజైన్ చేయడం జరిగిందని, తాడి పత్రి నేపథ్యంలో చిత్రీకరణ జరిపామని, త్వరలో టీజర్‌నూ, ట్రైలర్‌నూ విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నని ఐనవెల్లి, సంగీతం: అభిషేక్ రుపుస్.