Skip to main content

Namaste NRI

సమ్మర్‌ హాలిడేస్‌ టీజర్‌ లాంచ్‌

ప్రముఖ నిర్మాత ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన బాలలచిత్రం సమ్మర్‌ హాలిడేస్‌. శ్రీకర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. మాస్టర్‌ రోహన్‌, మాస్టర్‌ అరుణ్‌, బేబీ ఖుషి కీలక పాత్రధారులు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అగ్రనిర్మాత దిల్‌రాజు ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమా క్రెడిట్‌ అంతా నిర్మాత ధీరజ్‌ మొగిలినేనికే దక్కుతుందని, పిల్లలంతా చక్కగా నటించారని, తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు శ్రీకర్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉందని, లిటిల్‌ సోల్జర్స్‌ సినిమాను గుర్తు చేసే సినిమా ఇదని, నటించిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నిర్మాత ధీరజ్‌ మొగిలినేని చెప్పారు. రాజీవ్‌ కనకాల, వాసుకి, హర్షిణి, దర్శకులు కౌశిక్‌, నందకిశోర్‌, సాయిరాజేశ్‌తో పాటు బాలనటీనటులు ఖుషి, అరుణ్‌, రోహన్‌ కూడా మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానున్నది.


Social Share Spread Message

Latest News