Namaste NRI

 ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె నుంచి అసెంబ్లింగ్‌ ది రైడర్స్‌

 ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రాజెక్ట్‌ కె. వైజయంతీ మూవీస్‌ నిర్మాణంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్‌ నాయికగా నటిస్తున్నది.ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. సినిమా యూనిట్ యూనిక్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. మరో కీలక పాత్రను దిగ్గజ నటుడు బిగ్ బిఅమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అసెంబ్లింగ్‌ ది రైడర్స్‌ (విలన్స్‌) మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రతినాయకుడి సైన్యాన్ని చిత్రబృందం ఎలా రూపొందిస్తున్నారు అనేది చూపించారు. వారి దుస్తుల డిజైన్‌ బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సూపర్‌హీరో చిత్రాలను పోలి ఉంది. ఈ వీడియోలో రైడర్స్‌ అంటే ఒకేలా కనిపించే శత్రు సేన అంటూ వివరించారు. కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ అర్చన రావు, నితిన్‌ జైని, ప్రొడ్యూసర్‌ స్వప్న దత్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ వీడియోలో కనిపించారు. రైడర్స్‌ మేకోవర్‌ కోసం ఎక్కువ ఖర్చు అయ్యిందని నిర్మాత స్వప్న తెలిపారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌గా ఉండబోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events