Skip to main content

Namaste NRI

మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి బాల‌కృష్ణ భైర‌వ ద్వీపం – రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ క్లాసిక్‌ చిత్రం భైరవద్వీపం. రోజా ప్రధాన పాత్రల్ని పోషించారు.   దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 14 ఏప్రిల్‌ 1994న విడుదలై గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా క్లాప్స్‌ ఇన్ఫోటెన్‌మెంట్‌ సంస్థ పి.దేవ్‌తో కలిసి చంద్రశేఖర్‌ కుమారస్వామి ఈ క్లాసిక్‌ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకుల కోసం సరికొత్త సొబగులు అద్ది 4కె క్వాలిటీతో ఆగస్టు 5న రీ రిలీజ్‌ చేస్తున్నారు. రావికొండల రావు రచించిన ఈ మ్యూజికల్‌ లవ్‌స్టోరీకి మాధవపెద్ది సురేష్‌ సంగీతం అందించారు. ఈ పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఇక‌ ఈ మూవీలో కైకాల సత్యనారాయణ, విజయ కుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కె.ఆర్. విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ ముఖ్య పాత్ర‌లు పోషించారు. అంతే కాకుండి ఈ సినిమా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events